daanamma jeevitham!!
The title literally means "what a pitiable life". I wrote this in anguish about the rampant corruption. I could express it better in my native language telugu, and hence the blog below..(The translation is at the end of the blog) ఎంత తింటారు రా. విసుగు రాలేదా? జనాలని దోచుకుని దోచుకుని...చచ్చిపోతున్నారు రా జనాలు అక్కడ...ఏమి సాధించారు రా.. ఒక కోటి, పది కోట్లు, వంద కోట్లు, వెయ్యి కోట్లు సరిపోలేదా.. లక్షల కోట్లు కావాలా.. అది కూడా కష్టపడి సంపాదించడం కాదు.. పక్క వాడి డబ్బులని దోచుకోవడం...ఎందుకు రా ఈ బతుకులు తప్పు చేసాను అని అనిపించదా? సిగ్గు, మానం మర్యాద చచ్చిపోయాయా మీలో? ఏం చేసుకుంటారు రా అన్ని డబ్బులు...వున్నాయి అని బయటపెట్టుకోలేరు..కాబట్టి ఆనందించలేరు... మరి ఆ డబ్బులు ఉంది ఏం లాభం రా.. అలాంటప్పుడు ఎందుకు రా అంత దోచుకోవడం.. ఎవరో అన్నారు...ఒక కోటి తరువాత ఎన్ని కోట్లు సంపాదించినా ఒకటే అని... మరి ఆ ముక్క మీకు అర్ధం కాదా? ఇంత డబ్బులు తిని మీకు ఇంకా నిద్ర ఎలా పడుతోంది రా. మీ బుర్ర కూడా చచ్చిపోయిందా..పాపం పుణ్యం అనే వ్యత్యాసం అర్ధం కావట్లేదా? ఎందుకు...