Tavika to Sirivennela Sitarama sastry on his demise - dated: 1st Dec 2021
సిరి వెన్నెల సీతారామశాస్త్రి “కలా”మ తల్లికి, ఇదే నా అశృ శబ్దాంజలి -
సిరి సిరి మువ్వల సిరిసరసి సూర్యభానమే “సి”కారమై,
రేపటి తూర్పు రుచిని రేచీకటికి రమించిన రాగమే “రి”కారమై
వేకువ విశ్వనాధ భస్మ షాహి వెల్లువైన వేదామృతమే “వె”కారమై,
నాన్న మన్నన వంటి సిరివెన్నెల నాదమే “న్నె”కారమై,
లలిత కళల లావణ్య లాస్య లిఖితలే “ల”కారమై
సరస స్వర సుర ఝరీగమనమే “సీ”కారమై,
తొలి తొలకరికి పులకరించిన తెలుగు తీపే “తా”కారమై,
రసఝరులు జాలువారే రుద్ర రాగాభిషేకమే “రా”కారమై,
మలయా నిలయుడైన ముక్కంటి మంత్రజపమే “మ”కారమై
శివ సన్నిధికై విరుచుకుపడు సురగంగ శ్వాస ఛలనమే “శా”కారమై,
సాగిన సాధన సార్ధకమొందగ సీతారామ సవ్వడలే శా”స్త్రి”కారమై!!
- వంగర శ్రీరాం
Comments