Verse on SPB on his demise - Dated: 28th Sep 2020
సంగీత ఝరి..
ఎటువంటి ఝరికి అయినా, దానికి స్వరూపం ఇచ్చేది దానికి ఉన్న అవధులు, అవే లేకపోతే, ఝరి అనంతమైపోయి ఉనికిని కోల్పోతుంది.
మన తెలుగు పాటలకు, ఒక నా లాంటి సామాన్యుడు పాడుకో గలిగే తెలుగు పాటల ఝరికి ఒక అవధి, బాల సుబ్రహ్మణ్యం గారు.
ఈ అవధి, ఒక అడ్డంకి లా కాకుండా, ఈ ప్రవాహానికి ఒక సారూప్యం ఇచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాట రూపు, బాల సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే.
“స”, “ప” లు జనరంజకమవ్వాలంటే భాష మరియు భావాల “బ”లిమి కలవాలి అని,
“SPB” ని అమ్మవారే మనకి అనుగ్రహించారు.
ఆయన స్ఫురణే ఈ ఝరికి స్ఫూర్తి!!
ఆ మహానుభావుడికి ఇదే నా పదాంజలి!!
- వంగర శ్రీరాం
Comments